
ఈత సరదా-విషాదంగా మారకుండా జాగ్రత్త పడుదాం.
మైనర్‌లకు వాహనాలు ఇవ్వొద్దు – చిన్న నిర్లక్ష్యం ప్రాణ నష్టానికి దారితీయవచ్చు
వేసవి సెలవుల దృష్ట్యా పిల్లల కదలికలు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.
వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో పిల్లలు,యువకులు ఈత నేర్చుకోవడానికి చెరువులు, కాలువల వద్దకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉన్నందున ఇట్టి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈత సరదా విషాదంగా మారకూడదు అని జిల్లా ఎస్పీ సూచించారు.
ఈత రానివారు బావులు, చెరువులు, కాలువల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు. ఈతను నేర్చుకునే వారు తప్పనిసరిగా తల్లిదండ్రుల సమక్షంలోనే నేర్చుకోవాలని,ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువులు, కాలువలు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు.ఏదైనా అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటే పిల్లల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించారు.
మైనర్ లకు వాహనాలు ఇవ్వకండి
జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్ లపై ప్రత్యేక శ్రద్ధ ఉంచడం జరిగినదని తల్లిదండ్రుల, మైనర్లకు వాహనం ఇవ్వకూడదని,వాహనం ఇచ్చినచో వారు తెలిసి తెలియని డ్రైవింగ్ తో వాహనం నడపటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని,దానితో వారికి మరియు ఎదుటి వ్యక్తులకు ప్రమాదం జరగటం వల్ల రెండు కుటుంబాలు నష్ట పోతున్నాయని కావున మైనర్ లకు వాహనాలు ఇవ్వకూడదని, ఒకవేళ మైనర్ కు వాహనం ఇచ్చి ఏదైనా ప్రమాదం జరిగిన లేదా మైనర్ డ్రైవింగ్ చేస్తూ వాహనం తో పట్టుబడిన వాహన యజమాని పై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు.





