Breaking News

వర్గల్ మండల్: పల్లె ప్రగతి

103 Views

పంచాయతీలకు 1,283 కోట్లు.. పల్లెప్రగతి నిధులు విడుదల

గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం భారీ గా నిధులు విడుదల చేసింది. ఏప్రిల్‌ నుంచి ఆ గస్టు వరకు 5 నెలల మొత్తం రూ. 1,283.30 కోట్లను ఒకేసారి జమచేసింది.

పంచాయతీలకు ప్రతి నెలా రూ.256.66 కోట్లను రాష్ట్ర ప్రభు త్వం జమచేస్తుండగా, ఒకేసారి విడుదల చేసిం ది. 15వ ఆర్థిక సంఘం మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌ నిధులు రూ.707.50 కోట్ల ను కేంద్రం తాజాగా

గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం భారీ గా నిధులు విడుదల చేసింది. ఏప్రిల్‌ నుంచి ఆ గస్టు వరకు 5 నెలల మొత్తం రూ. 1,283.30 కోట్లను ఒకేసారి జమచేసింది. పంచాయతీలకు ప్రతి నెలా రూ.256.66 కోట్లను రాష్ట్ర ప్రభు త్వం జమచేస్తుండగా, ఒకేసారి విడుదల చేసిం ది. 15వ ఆర్థిక సంఘం మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌ నిధులు రూ.707.50 కోట్ల ను కేంద్రం తాజాగా విడుదల చేసింది. వీటిని ఒకటి రెండురోజుల్లో గ్రామ పంచాయతీ ఖాతాలకు బదలాయించనున్నారు. ఇలా పంచాయతీలకు రూ.1990.80 కోట్లు జమకానున్నాయి.

కేంద్రం సహకరించకున్నా ఆగని నిధులు
పల్లెల రూపురేఖలు మార్చడానికి సీఎం కేసీఆర్‌ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చు ట్టారు. ఈ కార్యక్రమానికి నిధులు సమకూర్చడానికి కేంద్రం ఇచ్చే నిధులతో సమానంగా ప్ర తి నెలా రాష్ట్రప్రభుత్వం తరఫున కూడా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒకేసారి పెద్ద ఎత్తున నిధులను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బందులు పాల్జేసినా, రుణ సేకరణకు అడ్డంకులు సృష్టించినా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సరిగా ఇవ్వకపోయినా రాష్ట్రం మాత్రం పంచాయతీలకు పక్కాగా నిధులు విడుదల చేస్తున్నది. పల్లెప్రగతితో ప్రతి గ్రామంలో వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌ షెడ్‌, ట్రాక్టర్‌ సౌకర్యం కల్పించారు. దీనితో గ్రామాలు పచ్చదనంతో పరి శుభ్రంగా మారాయి. పారిశుద్ధ్య సమస్య లేకుండా అయింది. జాతీయస్థాయిలో దేశంలోనే అనేక స్వచ్ఛ అవార్డులను రాష్ట్రం గెలుచుకొన్నది.

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal