Breaking News

మాదాపూర్‌లో కొత్త పెలికాన్ సిగ్నల్‌ ప్రారంభం*

94 Views

మాదాపూర్‌లో కొత్త పెలికాన్ సిగ్నల్‌ ప్రారంభం*

“సేఫ్ సిటీ ప్రాజెక్ట్” భాగంగా ప్రారంభించిన.. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర*

శేరిలింగంపల్లి, ఆగస్ట్ 25 (జనయం ప్రతినిధి):సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో మాదాపూర్ జోన్‌లోని గూగుల్ ఆఫీస్ జంక్షన్ వద్ద పెడెస్ట్రియన్ క్రాసింగ్ కోసం కొత్త పెలికాన్ ట్రాఫిక్ సిగ్నల్‌ను శుక్రవారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్, మాదా శ్రీనివాస్ రెడ్డి, మాదాపూర్ ట్రాఫిక్ ఏడీఎస్ ట్రాఫిక్ ఫోరమ్ జైంట్ సెక్రటరీ శ్రీనివాస్, “సేఫ్ సిటీ ప్రాజెక్ట్” డైరెక్టర్ రఘునందన్ తో కలిసి. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..రోడ్డు దాటే సమయాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ పెలికాన్ సిగ్నల్ ఏర్పాటు ద్వారా పెడెస్ట్రియన్ క్రాసింగ్ లో జరిగే ప్రమాదాలను నియంత్రించేందుకు వచ్చామన్నారు. సైబరాబాద్ లో మొత్తంగా 44 పెలికాన్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేశామన్నారు.
పాదాచారుల భద్రతా ముఖ్యమని సీపీ తెలిపారు.
ఎస్‌ఎస్‌సి ట్రాఫిక్ వాలంటీర్లను సైబరాబాద్ ట్రాఫిక్ ను మెరుగుపరిచేందుకు అడ్మిషన్స్‌కు సీపీ అభినందించారు.”సేఫ్ సిటీ ప్రాజెక్ట్”లో భాగంగా పెలికాన్ ట్రాఫిక్ సిగ్నల్ ఇన్‌స్టాల్ చేయడం జరిగింది.
రానున్న రోజుల్లో మరిన్ని పెలికాన్ సిగ్నల్స్ లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ మాట్లాడుతూ.. సైబరాబాద్ లో ఇప్పటి వరకు 44 సిగ్నల్స్ ను ఏర్పాటు చేశామన్నారు.
ఈ పెలికాన్ సిగ్నల్ ద్వారా పెడెస్ట్రియన్ క్రాసింగ్ లో జరిగే ప్రమాదాలను నియంత్రించవచ్చు. పాదాచారులు ఎక్కువగా రోడ్ దాటే ప్రదేశాలను గుర్తించి అక్కడ పెలికాన్ సిగ్నల్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీతో పాటు, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్, మాదాపూర్ డీసీపీ సందీప్, మాదాపూర్ ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాస్ రెడ్డి, మాదాపూర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నర్సయ్య, ఎస్సీఎస్సీ ట్రాఫిక్ ఫోరం జైంట్ సెక్రటరీ శ్రీనివాస్, “సేఫ్ సిటీ ప్రాజెక్ట్” డైరెక్టర్ రఘునందన్, ట్రాఫిక్ వాలంటీర్లు, సిబ్బంది, ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *