Breaking News

రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్

32 Views

నిలిచిన ఆర్టీసీ బస్సులు

-పలించని చర్చలు అర్దరాత్రి నుంచి బస్సులు బంద్

ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకై ప్రభుత్వానికి 41రోజుల క్రితం సమ్మె నోటీసు ఇచ్చారు. చివరి క్షణంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరిపినా పలితం లేకపోయింది.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన జెఎసి నేతలు,మూసి సుందరీకరణకు డబ్బులు ఉన్నాయి కానీ ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల కోసం ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా అని ప్రశ్నించారు.హైదరాబాద్ లో ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని ఆరోపించారు.సకల జనుల సమ్మె తరహాలో ఆర్టీసీ సమ్మె కొనసాగనున్నట్లు నాయకులు ప్రకటించడంతో ఏప్రిల్ 22 అర్దరాత్రి నుండి ఆర్టీసీ బస్సులు నిలిచి పోయాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి పెట్టడంతో అక్కడక్కడ కొన్ని బస్సులు రోడ్డు ఎక్కాయి ప్రైవేటు వ్యక్తులను పెట్టీ బస్సులను నడిపిస్తే పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయని ఆర్టీసీ జేఏసీ నేతలు హెచ్చరించారు.కాగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,ఆర్టీసీ ఎండీ మాట్లాడుతూ సమ్మె పై పునరాలోచించాలని ప్రజలు ఇబ్బంది పడతారని ఆర్టీసీ జేఏసీ నేతలకు సూచించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *