ప్రాంతీయం

ఘనంగా ఇన్ స్పేర్ గ్లోబల్ ఫౌండేషన్ 3 వ వార్షికోత్సవ వేడుకలు..

12 Views

ఘనంగా ఇన్ స్పేర్ గ్లోబల్ ఫౌండేషన్ 3 వ వార్షికోత్సవ వేడుకలు..-ఇన్ స్పేర్ గ్లోబల్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం – గుడాల శేఖర్ గుప్తా 

సిద్దిపేట్, ఏప్రిల్ 21, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఇన్ స్పేర్ గ్లోబల్ ఫౌండేషన్ వారి 3 వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు, ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవలు మరియు భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి వివిధ సామాజిక సేవల్లో పని చేసిన వారిని, అలాగే జర్నలిస్టు లకు చిరు సన్మానం చేసి జ్ఞాపిక అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సారధి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్తా మాట్లాడుతూ సమాజ సేవలో యువత మరియు స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకం అని, ఇన్ స్పేర్ గ్లోబల్ ఫౌండేషన్ గడచిన మూడు సంవత్సరాల్లో విద్య వైద్యం, సామాజిక సేవలో వారు చూపిస్తున్న కృషి అభినందనీయమని ఇటీవల గజ్వేల్ లో 3 కే రన్ నిర్వహించి అందరి మన్ననలు పొందారని, భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలవాలని అన్నారు అలాగే పేద ప్రజలకు అండగా ఇలాంటి స్వచ్ఛంద సేవ సంస్థలు ముందుకు రావాలని ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో ఇన్ స్పేర్ గ్లోబల్ ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *