ప్రాంతీయం

బ్లాక్ స్పాట్ ల వద్ద జాగ్రత్త చర్యలు చేపట్టిన పోలీసులు

82 Views

 

ప్రమాదాలు జరుగు ప్రదేశాలు గుర్తించి జాగ్రత్త చర్యలు బలోపేతం.

రాగట్లపల్లె మూల మలుపు వద్ద సైన్ బోర్డు ఏర్పాటు చేసిన డీఎస్పీ నాగేంద్రచారి

ఎల్లారెడ్డిపేట మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీసులు పలు చర్యలు చేపట్టారు. మండల పరిధిలోని ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించారు.ఈక్రమంలో ఆయా ప్రాంతాల్లో రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు రాగట్లపల్లి వద్ద స్వయంగా డిఎస్పి నాగేంద్ర చారి సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టారు.సిఐ వెంకటేష్, రాహుల్ రెడ్డి లు తిమ్మాపూర్,అల్మాస్పూర్ గ్రామాల వద్ద ప్రధాన రహదారిపై ఇరువైపులా వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగేలా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు వంటి చర్యలు చేపట్టరు.ఈచర్యల ద్వారా వాహనదారుల్లో అప్రమత్తత పెరిగి రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని అధికారులు తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తూ భద్రతతో ప్రయాణించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *