ప్రాంతీయం

శిరస్త్రాణం (హెల్మెట్) వాడకం ప్రతి ఒక్కరి భాద్యత..

12 Views

 

శిరస్త్రాణం (హెల్మెట్) వాడకం ప్రతి ఒక్కరి భాద్యత..

సిద్దిపేట్ మార్చి 28, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ టి. లక్ష్మీబాబు తెల్పిన వివరాల ప్రకారం.  మార్చి 28,సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిద్దిపేట ఎ.సి.పి యం. రవీందర్ రెడ్డి, హాజరు అయి సిద్దిపేట నందు గల మహీంద్రా ట్రాక్టర్ షోరూం, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం వాళ్ల సహకారంతో సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరికీ హెల్మెట్ లను పంపిణీ చేసినారు.  అరైవ్ అలైవ్   రోడ్డు భద్రత వారోత్సవల కార్యక్రమంలో భాగంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మి పెరుమాళ్, ఐ.పి.ఎస్ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి భద్రత దృష్ట్యా ప్రతి పోలీస్ సిబ్బంది భాద్యతగా హెల్మెట్ ధరించలని తెల్పినారు. పోలీస్ సిబ్బంది అందరూ ఆరోగ్యంగా ఉండాలని జిల్లా పోలీస్ సిబ్బందికి ఇటీవల స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేసినారు. పోలీస్ సిబ్బంది ఎవరు అనారోగ్యనికి గురికాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆరోగ్య కాకి కార్యక్రమంతో అందరికీ రక్త నమూనాలను సేకరించి, డాక్టర్ లను సంప్రదించే కార్యక్రమాలను చేయనున్నారు.ఈ సందర్భంగా సిద్దిపేట ఎ.సి.పి యం. రవీందర్ రెడ్డి మాట్లాడుచు హెల్మెట్ ధారణ ప్రతి ఒక్కరికీ అత్యంత ముఖ్యమని, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అలాగే పోలీస్ సిబ్బంది ముందుగా హెల్మెట్ వినియోగంలో ఆదర్శంగా ఉండాలని, ప్రజలకు అవగాహన కల్పించడంలో ముందుండాలని సూచించారు. రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెల్పి మహీంద్రా ట్రాక్టర్ షోరూం, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం ఇచ్చిన హెల్మెట్ లను సిబ్బందికి అందించినారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్స్పెక్టర్ టాటా లక్ష్మీ బాబు, ఎస్.ఐ లు చంద్రయ్య, మల్లేశం, సిబ్బంది మరియు షోరూం ప్రతినిధులను అభినందించారు.

No Slide Found In Slider.

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ 9100622768

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *