
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చలివేంద్రం ప్రారంభించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి
ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివెంద్రం ను సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి,స్థానిక సీఐ వెంకటేష్, ఎస్సై రాహుల్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ రోజువారి కార్మికులైన ఆటో యూనియన్ సభ్యులు అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవ చేయాలనే ఆలోచనతో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు కట్టెల బాలయ్య అధ్యక్షులు కొత్తపెళ్లి బాలరాజు.ఉపాధ్యక్షులు గడ్డం శ్రీనివాస్.మాజీ అధ్యక్షులు భోగ శ్రీనివాస్,పెంటం ప్రవీణ్.గన్నగోని అంజయ్య.కట్టెల బాబు తుపాకుల ప్రవీణ్.బసపురం బాలయ్య,దేవానందం,ఎస్ కే నవాబ్,అజముద్దీన్.సాయి,ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.





