భూ భారతి అప్లికేషన్స్ డిస్పోసల్, ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియ గూర్చి ఆర్డీఓలు, తహసిల్దార్లతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి జూమ్ సమావేశం
సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 29, ( తెలుగు న్యూస్ 24/7 )
సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ లో భూ భారతి అప్లికేషన్స్ డిస్పోసల్, ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియ గూర్చి ఆర్డీఓలు, తహసిల్దార్లతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి జూమ్ సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్ష జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..
భూ భారతి అవగాహన సదస్సులో మండలాల్లో స్వీకరించిన దరఖాస్తులను డిస్పోజల్ ప్రక్రియను ఎన్ని పెండింగ్ లో ఉన్నాయనీ ఆరా తీసి డిస్పోసల్ ప్రక్రియ వేగవంతం చెయ్యాలని ఆదేశించారు.ఎలక్టోరల్ రోల్ మ్యాపింగ్ బిఎల్ఓ లు 100 శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తాసిల్దార్లను ఆదేశించారు. 18 సంవత్సరాల నిండిన ఓటరు వెరిఫై, ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణకు సంబంధించిన అన్ని పనులను ఫీల్డ్ స్థాయిలో ఇంటింటి తనిఖీలు వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి రోజు చేసిన మ్యాపింగ్ వివరాలు కంప్యూటర్ లో అప్లోడ్ చెయ్యాలని తెలిపారు. సూపర్ వైజర్ లు ఎల్లపుడు బిఎల్ఓ పని తీరును మానిటర్ చెయ్యాలి. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో జీపీఓలు, సూపర్ వైజర్లు, బూతు స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఓటరు జాబితా రూపొందించాలని తెలిపారు.





