ప్రాంతీయం

జాగ్రత్త.. మోసగాళ్లు ఉన్నారు..!-విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం – ‘ట్రివియల్ చాప్టర్’ గ్యాంగ్ బట్టబయలు, ఇద్దరు అరెస్ట్.. 

101 Views

జాగ్రత్త.. మోసగాళ్లు ఉన్నారు..!-విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం – ‘ట్రివియల్ చాప్టర్’ గ్యాంగ్ బట్టబయలు, ఇద్దరు అరెస్ట్.. 

హైదరాబాద్, ఏప్రిల్ 15, తెలుగు న్యూస్ 24/7 

విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగ యువత నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన మోసగాళ్లను జూబిలీ హిల్స్ పోలీస్ .లు “ట్రివియల్ చాప్టర్” పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు కీలక సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.గ్రీస్, రొమేనియా వంటి యూరోపియన్ దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఈ గ్యాంగ్ అభ్యర్థులను ఆకర్షించింది. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసింది. డబ్బులు తీసుకున్న తర్వాత నకిలీ ఆఫర్ లెటర్లు ఇచ్చి, అనంతరం బాధితులతో అన్ని రకాల కమ్యూనికేషన్ నిలిపివేసింది.ఈ గ్యాంగ్ ఇంస్టాగ్రామ్ , ఫేస్బుక్ సోషల్ మీడియా వేదికలను ఉపయోగించి ఓ ప్రొఫెషనల్ ఓవర్సీస్ కన్సల్టెన్సీలా నటించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అవసరమైన రిక్రూట్‌మెంట్ ఏజెంట్ (ఆర్ ఏ ) లైసెన్స్ లేకపోయినా ఉన్నట్టు మోసం చేసింది. నమ్మకం కలిగించేందుకు ఆన్‌లైన్ టెంప్లేట్లతో నకిలీ “వర్క్ ఆథరైజేషన్” లెటర్లు తయారు చేసింది.ఈ కేసులో లంకా నిరూపమ (ఏ 7) – వైస్ ప్రెసిడెంట్ (సౌత్ జోన్), మామిడి అరుణ్ రాజ్ (ఏ 8) – రీజినల్ మేనేజర్ (తెలంగాణ)ను పోలీసులు అరెస్టు చేసారు.ఈ కేసులో మరో 8 మంది పరారీలో ఉన్నారు. వీరిలో సంస్థ ఫౌండర్, సీఈఓ, వీసా విభాగాధిపతి కూడా ఉన్నారు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ సంస్థ గతంలో ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు రికార్డులు సూచిస్తున్నాయి..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *