పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఏటీఎం ను ఎత్తుకెళ్లిన దొంగలు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ సమీపంలో గల ఎస్బిఐ ఎటిఎంను అర్ధరాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో సినీ ఫక్కీలో ఏటీఎం ను చోరీ చేశారు. తక్షణమే స్పందించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు ముమ్మరం చేశారు.పరిస్థితిని ఎప్పటికప్పుడు డిఎస్పి నాగేంద్ర చారి సమీక్షిస్తుండగా సిఐ వెంకటేష్ ఎస్ఐ రాహుల్ రెడ్డి లు సీసీ ఫుటేజీల ఆధారంగా దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు.






