ప్రాంతీయం

నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్

104 Views

దౌల్తాబాద్: సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరంగా మారిందని సర్పంచ్ పంచమి స్వామి, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సిహెచ్ స్వామి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కోనాపూర్ గ్రామానికి చెందిన వంచ కొండల్ రెడ్డి రూ. 52, వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలు మెరుగైన వైద్యం పొందడానికి సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుచ్చ గౌడ్, యాదవ రెడ్డి, మహిపాల్, యాద గౌడ్, ప్రభాకర్, స్వామి గౌడ్, రమేష్ యాదవ్, సతీష్ గౌడ్, బాలస్వామి, చందు రెడ్డి, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
Jana Santhosh