క్రీడల్లో గ్రామీణ యువత ప్రతిభకనబర్చి జాతీయ, అంతర్జాతీయస్థాయి టోర్నీల్లో రాణించాలని బ్రహ్మశ్రీ కొడకండ్ల శ్రీరామ్ శరణ్ శర్మ గురూజీ పేర్కొన్నారు. మండలంలోని దోమ్మాటలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ లో రెండవ రోజు జరిగిన మ్యాచ్ లను వీక్షించారు. అనంతరం ఆయన క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గెలుపోటములు సహజమన్నారు. ఈ టోర్నమెంట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయిలో అవకాశం వచ్చేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దొమ్మాట సర్పంచ్ పూజిత వెంకటరెడ్డి, గాజులపల్లి సర్పంచ్ అప్పవారి శ్రీనివాస్, దొమ్మాట ఉప సర్పంచ్ ఈదన్న గారి సింహాచలం, వార్డు సభ్యులు కనకయ్య, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.




