ప్రాంతీయం

ఇక దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడమే మన గమ్యం.. అదే భారత రాష్ట్ర సమితి…ఆవిర్భావ లక్ష్యం తొగుటలో బీఆర్ఎస్ జెండావిష్కరణలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు

137 Views

తొగుట: తెలంగాణ తరహా దేశాన్ని అభివృద్ధి , సంక్షేమం దిశగా ముందుకు తీసుకెళ్లడానికే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టడం జరిగిందని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు.. మండల కేంద్రమైన తొగుటలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తో కలిసి బీఆర్ఎస్ పార్టీ జెండావిష్కరణ చేశారు…ఈసందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ..నాడు తెలంగాణ కోసం సబ్బండ వర్గాలను ఒక్క తాటిపైకి తెచ్చి.. సాకారం చేసుకున్నామని, దేశ రాజకీయాల్లో కూడా సీఎం కేసీఆర్ నాయకత్వంలో చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు
స్వరాష్ట్రం కోసం తన ప్రాణాన్ని ఫణంగా పెట్టిన కేసీఆర్,గారు.. తెలంగాణ సాధించిన వ్యక్తిగా..ప్రజల ఆశీస్సులతో సీఎంగా బాధ్యతలు చేపట్టి అనతి కాలంలోనే తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపారన్నారు. .సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి స్పూర్తితో రాబోయే రోజుల్లో దేశంలో మార్పు కోరుకోవడం ఖాయమన్నారు….
*సేవా కార్యక్రమాలు అభినందనీయం*
మనిషి జీవితం శాశ్వతం కాదని, చేసిన సేవలే జీవితాంతం నిలిచిపోతాయని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు. తొగుటలో కనకలక్ష్మి, ఫక్రోద్దీన్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీజర్ లను ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ లతో కలిసి పంపిణీ చేశారు…ఫ్రీజర్ సౌకర్యం లేక పోవడంతో మండల ప్రజలు సిద్దిపేట, గజ్వెల్ పట్టణాలకు వెళ్లాల్సి వొచ్చేదని, నేడు సమస్య తీరిందన్నారు..ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ తొగుటలో రెండు ఫ్రీజర్లు ఇవ్వడం జరిగిందని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు..ఈసందర్భంగా వారిని ఎంపీ, ఎమ్మెల్సీ ఘనంగా సన్మానించారు..
*భాస్కర్ రెడ్డి దంపతులకు సన్మానించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు*
అల్వాల బ్రిడ్జి పనుల కోసం సహకారం అందించిన బాసిరెడ్డి పద్మజ-భాస్కర్ రెడ్డి లకు మండల ప్రజాప్రతినిధులతో కలిసి కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సన్మానించారు.. కాన్గల్ లో బాసిరెడ్డి రాంభూపాల్ రెడ్డి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎంపీ గారు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు…కార్యక్రమాల్లో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్, వైస్ చైర్మన్ దోమల కొమురయ్య, కంది రాంరెడ్డి, మండల రైతు బంధు అధ్యక్షుడు బోధనం కనకయ్య, మండల సర్పంచ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సిరినేని గోవర్ధన్ రెడ్డి, కంకణాల నర్సింలు, సొసైటీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి, కో అప్షన్ సభ్యులు ఎండీ కాలీమోద్దీన్, ఎంపీటీసీలు వేల్పుల స్వామి, కొమ్ము శరత్, సర్పంచ్ లు గంగనిగాళ్ల మల్లయ్య, తోయేటి ఎల్లం, బొడ్డు నర్సింలు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కుంభాల శ్రీనివాస్, చిలువేరి మల్లారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బక్క కనకయ్య, నాయకులు కుంభం రఘోత్తం రెడ్డి, సుతారి రమేష్, ఎం చంద్రారెడ్డి, మంగ నర్సింలు, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, బిక్కునూరి శ్రీశైలం, మాష్టి కనకయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కొల కనకయ్య, శ్రీనివాస్ గౌడ్, అనిల్, నర్సెట్టి మల్లేశం, గొడుగు ఐలయ్య, మంగ యాదగిరి, తగరం అశోక్, శ్రీనివాస్, కనకయ్య, కర్ణాకర్, గణేష్, మహేష్, ఆంజనేయులు, ప్రవీణ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు..

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7