సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ మహా గణపతి దేవాలయంలో ఆదివారం సంకష్టహర చతుర్ధి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అద్యక్షులు డాక్టర్ మెరుగు శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో గణపతి దేవాలయంలో గణపతి విగ్రహాన్ని విశేష అలంకరణ చేసి భక్తి శ్రద్ధలతో ఘనంగ ప్రతేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి దాదాపు రెండు వందల మందికి అన్నదానం నిర్వహించారు ఈసందర్భంగా మెరుగు శ్రీనివాస్ మాట్లాడుతూ సంకష్టహర చతుర్ధి రోజున గణపతి దేవునికి పూజలు చేస్తే మంచిది అని ప్రజ్ఞాపూర్ లో వెలసిన పురాతన ఏకశిలా విగ్రహం దక్షిణం వైపు చూపుతో ఉన్న గణపతి దేవుని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయి అని సంకష్టహర చతుర్థి రోజు గణపతి దేవునికి ఇష్టమైన రోజు అని ప్రతి నెల అన్నదానంలో భాగంగా ఈరోజు మాకు అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని ప్రతి ఒక్కరూ గణపతి దేవాలయాన్ని దర్శించుకుని తరించాలని ఆకాంక్షించారు