
సెస్ సంస్థను విలీనం చేస్తే ఉప్పెనలా ఉద్యమిస్తాం…
కేటీఆర్ పై కక్ష సాధింపు కోసం రైతుల,విద్యుత్ వినియోగదారుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు.
తెలుగు న్యూస్ 24×7: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెస్ డైరెక్టర్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేగా కేటీఆర్ ఉన్నందున కేటీఆర్ పై కక్ష సాధింపు లో బాగంగా రాజకీయంగా ఎదుర్కోలేక ఈ ప్రాంత రైతుల గుండెకాయ లాంటి సెస్ సంస్థను ఎన్పీడీసీఎల్ లో విలీనం చేస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ ప్రాంత వాసులు గత 56 సంవత్సరాలుగా సెస్ సంస్థ ద్వారా సేవలు పొందుతున్నారని అంతటి ఘన చరిత్ర కలిగిన సెస్ సంస్థను విలీనం చేయడం వల్ల ఓ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అది వచ్చేసరికి రైతులు నష్టపోతారని అన్నారు.మీటర్ కనెక్షన్ కావాలంటే వేచి చూడాల్సిన పరిస్థితి దాపురిస్తుందని ప్రస్తుతం సెస్ సంస్థ ప్రతినిధులుగా గ్రామాల్లో మండలంలో డైరెకర్ గా అందుబాటులో ఉంటూ రైతులకు సేవలు అందిస్తున్నామని అన్నారు.సెస్ సంస్థ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సెస్ సంస్థను విలీనం చేయకుండా ఆపాలని విన్నవిస్తున్నామని అన్నారు. ఏవైనా లోపాలు,ఆరోపణలు ఉంటే విచారణ జరిపి సంస్థాగతంగా చర్యలు తీసుకోవాలి కానీ సంస్థ మనుగడకే ప్రమాదం తెస్తే ఎలా అని ప్రశ్నించారు.ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోక పోతే సెస్ సంస్థను కాపాడుకోవడానికి రానున్న రోజుల్లో ఈ ప్రాంత రైతులతో కలిసి ఉప్పెనలా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు,బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ లు,మాజీ ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





