ప్రాంతీయం

నిమజ్జన వేడుకలు

146 Views

 

 

గణేషునికి ‘బాయిజమ్మ ట్రస్ట్’ ఘన వీడ్కోలు

– సాయి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో నిమజ్జన వేడుకలు

– అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు, సేవకులు, కాలనీ ప్రజలు

బెల్లంపల్లి సెప్టెంబర్ 16

బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీలో గల సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన గణేషునికి ఘనంగా వీడ్కోలు పలికారు. ట్రస్టు కార్యాలయం వద్ద సోమవారం మధ్యాహ్నం నిమజ్జన వేడుకలను ప్రారంభించి స్థానిక బెల్లంపల్లి బస్తి చెరువులో నిమజ్జనం చేశారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి ల ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా ట్రస్టు ఆధ్వర్యంలో గత 9 రోజులుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా చివరి రోజైన సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి విభిన్నమైన వివిధ ప్రసాదాలను సమర్పించారు. అనంతరం నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు.

నవరాత్రి వేడుకలు విజయవంతం

ఈ సందర్భంగా బాయిజమ్మ సాయి సేవా ట్రస్టు వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ, తమ ట్రస్టు ఆధ్వర్యంలో ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ట్రస్ట్ సేవకులు, సాయి భక్తులు పాల్గొని విజయవంతం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్- రాజేశ్వరి, సేవకులు, భక్తులు, రాజకీయ ప్రముఖులు, బస్తీ ప్రజలు పాల్గొన్నారు. ట్రస్ట్ వారు దాతలకు, పోలీసు సిబ్బందికి, ప్రభుత్వ ఎలక్ట్రికల్స్ సిబ్బందికి, మీడియా వారికి, భక్తులకు ధన్యవాదాలు తెలియజేశారు.

అన్నదానం చేద్దాం రండి

ట్రస్ట్ ద్వారా “ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం” అని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని,మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్  తెలిపారు. ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జేరిపోతుల చంద్రకళ, సేవకులు కాంపల్లి రాజం కవిత స్నేహ సాయి రాజ్ కోలా గోపాల్ ఈగురపు భాస్కర్, ఎండి యూసఫ్, అబ్బు విజయ్ భక్తులు తొమ్మిదో వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం, సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని కోరారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్