ప్రాంతీయం

క్యాతనపల్లి మున్సిపాలిటి చైర్మన్ & వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా నిర్వహణ కి పటిష్ట మైన బందోబస్తు : బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్

6 Views

రామగుండం పోలీస్ కమిషనరేట్

క్యాతనపల్లి మున్సిపాలిటి చైర్మన్ & వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా నిర్వహణ కి పటిష్ట మైన బందోబస్తు : బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్

రేపు క్యాతనపల్లి మున్సిపాలిటిలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా శాంతి భద్రతలను కాపాడేందుకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయబడినవి. ఈ సందర్భంగా బందోబస్తు కి ఏసీపీ -04,సీఐ – 23, ఎస్ ఐ – 46, ఏ ఎస్ ఐ / హెడ్ కానిస్టేబుల్ – 98, పోలీస్ కానిస్టేబుల్ -167, మహిళా పోలీస్ సిబ్బంది -49, స్పెషల్ పార్టీ సిబ్బంది -38, హోం గార్డ్స్ -60 మొత్తం 485, 4 టిజీ ఎస్ పి ఫ్లాటన్ లు విధుల్లో పాల్గొంటున్న పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి బెల్లంపల్లి ఏసీపీ శ్రీ కిరణ్ కుమార్ గారు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ… ఎన్నిక సందర్బంగా శాంతి భద్రతలను కచ్చితంగా పాటించాలి. ఉన్నతాధికారుల ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలి. డ్యూటీ ప్రదేశం నుండి ఎట్టి పరిస్థితి అనుమతి లేకుండా విడిచి వెళ్ళకూడదు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. విధుల్లో అప్రమత్తంగా ఉండి సమయానుకూలంగా ప్రవర్తించాలి. అనవసరంగా ప్రజలతో వాగ్వాదాలకు దిగకూడదు. విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శించకూడదు. ఎన్నిక ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తగినన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని, ప్రజలు, ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పోలీసులకు సహకరించాలని ఏసీపీ  విజ్ఞప్తి చేశారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *