ఆధ్యాత్మికం

మండల వ్యాప్తంగా చిన్న హనుమాన్ జయంతి వేడుకలు

191 Views

మండల వ్యాప్తంగా చిన్న హనుమాన్ జయంతి వేడుకలు

ఘనంగా కొత్తకుంట దాసాంజనేయ స్వామి ఆలయ 16వ వార్షికోత్సవ నిర్వహణ
ఎల్లారెడ్డిపేట: మండల వ్యాప్తంగా చిన్న హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి.ఆంజనేయ స్వామి మాలాదారులు,భక్తులు,ఆయా దేవాలయాల కమిటీల ఆధ్వర్యంలో వేకువ జాము నుండి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ప్రాతః కాల సమయంలో స్వామివారికి చందన అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు గావించారు.కొత్తకుంట దాసాంజనేయ స్వామి వారి ఆలయ 16వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో అత్యంత వైభవంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. వేకువజామున పూజల అనంతరం హోమం నిర్వహించి,అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా సాయంకాలం ఉత్సవమూర్తులతో శోభాయాత్ర చేపట్టారు. మండలంలోని ఆంజనేయ స్వామి ఆలయాలు రామనామ స్మరణతో మార్మోగి పోయాయి.ఇట్టి కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *