
రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చల్ల పద్మా రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.లబ్ధిదారులు నీరటి భూమరాజు 60.000,మారుపాక మనెవ్వ18.500. జరీనా బేగం 38000.బోయిని పరుశరాములు 14.000.సబీనా 25.000. సయ్యద్ ఓవైసీ హస్సేన్ 60.000.అల్లే బుధవ్వ 11.000.బుర్రవేణి సాయవ్వ 11.500.తెడ్డురవి 35.000. మొత్తం 2.73.000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరుపేదల ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదవారు ఆసుపత్రిపాలై అప్పుల పాలు కాకూడదనే తలంపుతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి హాస్పిటల్ చికిత్సకు ప్రభుత్వ బాధ్యతగా తీసుకొని దరఖాస్తు చేసుకున్న వారందరికీ విడతల వారీగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడం జరుగుతుందని అన్నారు.లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు చెక్కులు రావడానికి కృషిచేసిన సిరిసిల్ల నియోజక వర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి,డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,లకు స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షులు షేక్ సాహెబ్,జిల్లా కోశాధికారి కొండపురం శ్రీనివాస్ రెడ్డి,ఉపాధ్యక్షులు మార్పాక సత్యం,యూత్ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస్,ఇల్లందుల రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొంగరి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.





