రాజకీయం

ఉపాధిహామి పనుల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోంది: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

16 Views

 

*ఉపాధి హామీ పనుల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోంది*

*సిరిసిల్ల జిల్లాలో సగటున 50 రోజులు కూడా పనులు కల్పించలేకపోయారు*

*బడ్జెట్లో ఈ పథకానికి రూ.95,692 కోట్లను కేటాయించాం*

*ప్రతి ఒక్కరికీ 125 రోజులు పని కల్పించండి*

*రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్*

*సిరిసిల్ల జిల్లా అంకిరెడ్డిపల్లె,ముస్తాబాద్ లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి*

ఏటా 125 రోజులపాటు పని కల్పించాలనే లక్ష్యంతో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం వీబీజీ రామ్ జీ పథకాన్ని తీసుకొచ్చినా, తెలంగాణలో ఆశించిన విధంగా పని దినాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సిరిసిల్ల జిల్లాలో 92 వేల జాబ్ కార్డులుంటే సగటున 50 రోజులలోపు మాత్రమే పని కల్పిస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఏటా 125 రోజుల పని కల్పించేలా ఈ పథకాన్ని అమలు చేయాలని అధికారులను కోరారు.కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి, ముస్తాబాద్ మండలాల్లో పలు అభివ్రుద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డి పల్లె గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ.25 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముస్తాబాద్ లో రూ.10 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు అంకిరెడ్డిపల్లెలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. ఏమన్నారంటే…. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలను ధార్మిక చింతనతో నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది.ఏ గ్రామం వెళ్లినా,ఏ ఆలయం వెళ్లినా సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకలతో కళకళలాడాయి.ఈరోజు తంగళ్లపల్లి మండలంలోని అంకిరెడ్డిపల్లె గ్రామంలో రూ.25 లక్షల నిధులతో,ముస్తాబాద్ అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది.జాతీయ ఉపాధి హామీ పథకం కింద గత ఏడాది నా పార్లమెంట్ నియోజకవర్గంలో 32 కోట్ల 13 లక్షల రూపాయలు ఖర్చు చేసి రోడ్లను నిర్మించినం. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు దాదాపు 700 కోట్ల రూపాయల నిధులను మన పార్లమెంట్ పరిధిలో ఖర్చు చేసినం.ఈసారి ( 2026-27) కేంద్ర బడ్జెట్‌లో జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన VB-G RAM G పథకానికి 95 వేల 692 కోట్లను కేటాయించినం.గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ లో ఈ ఒక్క పథకానికే 40 శాతం నిధులు కేటాయించినం. మన తెలంగాణ విషయానికొస్తే… ఈ పథకం కింద 3 వేల కోట్లకుపైగా నిధులు వచ్చే అవకాశముంది. రాష్ట్రంలో సుమారు 32 లక్షల జాబ్ కార్డ్ హోల్డర్లు ఈ పథకం కింద లబ్ది పొందుతున్నారు. ఏటా 125 రోజుల పాటు పని కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చినం.కానీ తెలంగాణలో ఆశించిన విధంగా పని దినాలు కల్పించడంలో విఫలమవుతున్నారు.ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాలో ఆశించిన స్థాయిలో పనిదినాలు కల్పించలేక పోతున్నారు. ఈ జిల్లాలో 92 వేల జాబ్ కార్డులుంటే సగటున 50 రోజులలోపు మాత్రమే పని కల్పిస్తున్నారు.6 వేలలోపు కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పని దినాలు కల్పించారు.ప్రతి ఒక్కరికి ఏటా 125 రోజుల పని కల్పించేలా ఈ పథకాన్ని అమలు చేయాలని అధికారులను కోరుతున్నా…ఈ పథకానికి అయ్యే వ్యయంలో 60 శాతం నిధులను కేంద్రం ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను సైతం జాప్యం లేకుండా 40 శాతం నిధులను విడుదల చేయాలని కోరుతున్నా…పంచాయతీలకు, మున్సిపాలిటీల అభివ్రుద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నయాపైసా ఇయ్యడం లేదు. కానీ నిత్యం కేంద్రంపై దుమ్మెత్తి పోయడం అలవాటైంది. మోదీ ప్రభుత్వం ఎరువుల కొరత లేకుండా కావాల్సినన్ని ఎరువులను సరఫరా చేస్తున్నా… వాటిని అందుబాటులో ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ద పెట్టడం లేదు.ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి లాగుల తొండలు విడుస్తా అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.6 గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను దారి మళ్లిస్తున్నారు.కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ పెట్టడాన్ని హర్షిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం.ఎవరైనా పార్టీ పెట్టొచ్చు. ప్రజా సమస్యలపై పోరాడిన పార్టీలకే మనుగడ ఉంటుంది.

No Slide Found In Slider.

Poll not found
పందిర్ల రవికాంత్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర క్రైమ్ ఇంచార్జ్ 9848938940

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *