పాలమూరు:సెప్టెంబర్ 17
కరువు కరాల నృత్యం చేసిన భూముల్లో..
కృష్ణమ్మ జలతాండవం!
శెలిమిలే దిక్కైన కాడ
ఉద్దండ జలాశయాలు!
బాయి మీద పంపు సెట్లు నడవనిచోట
బాహుబలి మోటార్లు!
స్వరాష్ట్ర ప్రస్థానంలో సగర్వ సాగునీటి సన్నివేశం!
నిన్న… పరాయి నేలపై ప్రాజెక్టులకు రాలెత్తిన పాలమూరు లేబర్!
నేడు… సొంత భూమిలో ప్రాజెక్టుల కింద రతనాలు పండిస్తున్న ఫార్మర్!
బీర బీర తరలి వెళ్తున్న కృష్ణమ్మను బీడు భూములకు రప్పించేందుకు స్వయంపాలనలో సాహస యజ్ఞం!
ఇది ఎత్తిపోతల పథకం మాత్రమే కాదు…
రైతు జీవితాల్లో వెలుగులు నింపే నవ్యపతం… సీఎం కేసీఆర్ సంకల్పానికి నిలువెత్తు రూపం
పచ్చని పాలమూరు..
ఇక వలసలకు కేరాఫ్ కాదు..
వ్యవసాయ విప్లవానికి చిరునామా.
