ముఖ్యమంత్రి కేసిఆర్ కామారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యుడిగా పోటీ చేస్తా అని ప్రకటించిన వేళా.. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ నిధుల మళ్లింపు పై అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 23న బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి వేములవాడ రాజరాజేశ్వర స్వామి నిధుల మళ్లింపును విరమించుకుంటున్నామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. ఇది రాజన్న భక్తుల విజయంగా భావిస్తున్నాం..
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఏటా 100 కోట్లు కేటాయిస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ తెలిపారు.
