ప్రాంతీయం

మేకల అంగడిలో నీటి సౌకర్యం

19 Views

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేకల అంగడిని సక్సెస్ చేయడం కోసం పాలకవర్గం కృషి చేస్తుంది.గత కొద్ది వారాలుగా మండల కేంద్రంలో ప్రారంభించిన మేకల అంగడికి అమ్మకం దారులు కొనుగోలుదారులు రావడం పెరిగింది. దాంతో ఇంకా మేకల అంగడిని సక్సెస్ చేయాలనే తలంపుతో సర్పంచ్ ఎనగందుల నరసింహులు,పాలకవర్గం కృషి చేస్తున్నారు.అందులో భాగంగా నేడు జరుగుతున్న అంగడిని సందర్శించిన సర్పంచ్ ఎండలు మండుతుండడంతో జీవాలకు నీటి సౌకర్యం కల్పించాలని గొర్ల కాపర్లు,వ్యాపారులు,కోరగా అంగడి జరిగే ప్రాంతంలో నీటి కుండీలను ఏర్పాటు చేసి అందులో గ్రామపంచాయతీ ట్యాంకర్ తో నీటిని నింపి మూవజీవాలకు ఇబ్బంది కలగకుండా చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మేకల అంగడిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన తమ దృష్టికి తీసుకురావాలని సకల వసతులు కల్పించడానికి పాలకవర్గం సుముఖంగా ఉందని ఇట్టి మేకల అంగడిని ప్రజలు,గొర్ల కాపరులు,వ్యాపారులు వినియోగించుకోవాలని కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *