ముస్తాబాద్, ప్రతినిధి జూలై 5,మనిషి ఎంతో సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో సాధించినప్పటికీ మనిషి తయారు చేయలేని పదార్థం రక్తం.. ఈరక్తం అందక రోజుదేశంలో ఎన్నో వేలమంది మృత్యువడిలోకి చేరుకుంటున్నారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదానం.. ప్రతి రక్తపుబొట్టు పోయేప్రాణాన్ని కాపాడే ఆయువు అయితే ప్రస్తుత ఆధునిక సమాజంలో నేటికీ మనిషి రక్తదానంపై సరైన అవగాహన లేక రక్తదానం చేస్తే తమ ప్రాణాలకు ఏమవుతుందో అని భయపడుతూ రక్తదానానికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి సమాజంలో తెర్లుమద్ది గ్రామానికి చెందిన బాదవేణి భాగ్యలక్ష్మికి ముస్తాబాద్ అనురాధ ఆసుపత్రిలో O+ పాజిటివ్ రక్తం ఎమర్జెన్సీ ఉండగా చీకోడ్ గ్రామానికి చెందిన యూత్ నాయకులు గున్నాల రాజ్ కుమార్ గౌడ్ (కాకా) డొనేట్ చేసాడు. రాజ్ కుమార్ మాట్లాడుతూ ఐదవ రక్త
దానం చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నాడు. రక్త దానంవల్ల ఎటువంటి హాని ఉండదని, సమాజానికి ఓ సంకేతం పంపుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
