ఆధ్యాత్మికం

సీతారాముల కల్యాణంలో పాల్గొన్న డీఎస్పీ నాగేంద్రచారి

49 Views

ఘనంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం.

కళ్యాణం లో పాల్గొన్న డీఎస్పీ,సీఐ,ఎస్సై.

లడ్డు వేలం పాటలో 70 వేలకు దక్కించుకున్న భక్తుడు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం సీతారామచంద్రస్వామి కళ్యాణం ఘనంగా జరిగింది.ఉదయం స్వామి వారి ఎదుర్కొల్లతో ఆంజనేయస్వామి ఆలయం నుండి పెళ్లి మండపం పైకి స్వామివారిని తీసుకువచ్చారు. అర్చకులు వేణుగోపాల చారి,నవీన్ చారి, మనోహరాచార్యులు,కళ్యాణాన్ని నిర్వహించారు.శ్రీ రాజరాజేశ్వర స్వామి దత్తత దేవాలయమైన శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం నుండి పట్టు వస్త్రాలు తలంబ్రాలను పంపించారు.అనంతరం లడ్డును వేలం పాట వేయగా 70 వేల రూపాయలకు వంగల లింగారెడ్డి వేలంపాటలో దక్కించుకున్నారు. స్వామివారి వ్రతానికి బచ్చు మోహన్ 40 వేల రూపాయలతో మెట్లను చేయించారు.సిరిసిల్ల డిఎస్పి నాగేంద్ర చారి.ఎల్లారెడ్డిపేట సిఐ వెంకటేష్,ఎస్సై రాహుల్ రెడ్డిలు స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు 50 వేల రూపాయలతో అశ్విని ఆసుపత్రి డాక్టర్ జి సత్యనారాయణ స్వామి అన్నదానం చేశారు.స్వామి వారి కళ్యాణం ఏర్పాట్లను సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య ఆలయ కమిటీ చైర్మన్ మోతే లక్ష్మారెడ్డి లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం,వైస్ చైర్మెన్ గుండాడి రాంరెడ్డి.డిప్యూటీ తహసిల్దార్ ఎలుసాని ప్రవీణ్ కుమార్,ఉప సర్పంచ్ మధుసూదన్ రెడ్డి,హనుమాన్లు.నల్ల పరుశురాములు, నిమ్మ సుధాకర్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *