
కమనీయం రమణీయం… రాములోరి కళ్యాణం
శ్రీ సీతారాముల స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలోని సీతా రామాంజనేయ స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం శుక్రవారం నిర్వహించగా స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎదుర్కోళ్ళు నిర్వహించారు.మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవాన్ని బుగ్గ కృష్ణమూర్తి,శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో నేత్రపర్వంగా జరిపించారు.స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు పోసి వేదమంత్రోచ్ఛారణ మద్య కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు అయ్యారు.ప్రతి ఏటా నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవాన్ని గ్రామ ప్రజల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అందె సుభాష్,ఉపసర్పంచ్ దేవేందర్,ఆలయ కమిటీ చైర్మన్ దినేష్ రామాలయ విగ్రహ దాత పబ్బ విశ్వనాథం మాజీ సర్పంచ్ నారాయణ గౌడ్,కిషన్ రావు,బుర్ర ఉపేందర్,ఆలే శంకరయ్య,కొండ శ్రీనివాస్ గౌడ్,రాజేశం గుప్తా,దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొనగా మహిళలు ఒడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు.గ్రామ సర్పంచ్ సుభాష్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.





