
ఇల్లంతకుంట,ముస్తాబాద్ లో పర్యటించనున్న బండి సంజయ్ కుమార్
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేడు ఉదయం 11 గంటలకు సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెకు వెళతారు.జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన నిధులతో అంతర్గత సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేస్తారు.అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటలకు ముస్తాబాద్ లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.





