ప్రాంతీయం

బాకూరుపల్లె లో అభివృద్ధి పనులకు శ్రీకారం

15 Views

బాకూరు పల్లెలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

46 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు భూమి పూజ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బాకూరు పల్లె గ్రామపంచాయతీ పరిధిలో 46 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు బుధవారం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, సర్పంచ్ బొడ్డు జయశ్రీ భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నూతన గ్రామ పంచాయతీ నిర్మాణానికి 20 లక్షల రూపాయలు మహిళా సంఘం భవన నిర్మాణానికి 10 లక్షలు సీసీ రోడ్లకు10 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలతో కల్వర్టు నిర్మాణాల పనులు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.కొత్తగా ఏర్పడిన బాకూరు పల్లి గ్రామ పంచాయతీకి మొదటిసారి ఎన్నికైన సర్పంచ్ బొడ్డు జయశ్రీ కి అభినందనలు తెలిపారు.ప్రభుత్వం మారుమూల గ్రామాలలో అభివృద్ధి కోసం ఎన్ని నిధులైన వెచ్చించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు అని ఎన్నికల తర్వాత అభివృద్ధిపై దృష్టి నిలుపుతామని అన్నారు.గత ప్రభుత్వం చేసిన అప్పులకు 8 లక్షల పైచిలుకు వడ్డీ కట్టుతున్నామని అన్నారు.అయినప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆపడం లేదన్నారు.ఉచిత బస్సు ప్రయాణం కానీ 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లు మాఫీ కానీ.500 రూపాయలకే సిలిండర్ కానీ ఇవ్వడం జరుగుతుందన్నారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేస్తూ జిల్లా కలెక్టర్ తో కలిసి పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన గుండారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలను లబ్ధిదారులతో కలిసి సంతోషంగా ప్రారంభించామన్నారు.

సేవాలాల్ తండ ఉపసర్పంచ్ తో పాటు నలుగురు వార్డు సభ్యులు కాంగ్రెస్ లో చేరిక.

ఎల్లారెడ్డిపేట మండలంలోని సేవాలాల్ తండ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ భూక్య శ్రీనివాస్ తో పాటు బాకూరు పల్లె వార్డు సభ్యులు గొట్టేముక్కల అశోక్,అడుప రూప,బొడ్డు రేన,జంగాల రాజు సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది.వారిని సాధరపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానించారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాలలో చేసుకునేందుకు ఇంకా కొంతమంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి,ఉపసర్పంచ్ పడిగల రవీందర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సుడిద రాజేందర్, తిరుపతిరెడ్డి, మెండే శ్రీనివాస్,గొల్లపల్లి లక్ష్మారెడ్డి, నాయకులు షేక్ గౌస్,బండారు బాల్ రెడ్డి,దేవేందర్, సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
పందిర్ల రవికాంత్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర క్రైమ్ ఇంచార్జ్ 9848938940

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *