ప్రాంతీయం

ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం లో పాల్గొన్న కేకే మహేందర్ రెడ్డి.

71 Views

హరిదాస్ నగర్ లో పండగలా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం

కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ బాధ్యులు కే.కే. మహేందర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ షేక్ సాబేర బేగం,కేకే మహేందర్ రెడ్డి,సర్పంచ్ చిర్రం నాగరాజు తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు గృహప్రవేశాలు పండగ వాతావరణం లో జరుగుతున్నాయన్నారు.ప్రభుత్వ పథకంతో లబ్ధి పొంది సద్వినియోగం చేసుకొని సొంత ఇంటి కలను నెరవేర్చుకున్న లబ్ధిదారులకు  అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మటి నరసయ్య,గ్రామ శాఖ అధ్యక్షులు గురక పరుశరాములు యాదవ్,వార్డు సభ్యులు పంతంగి అశ్విని,తెడ్డు అనిత,పంతంగి సతీష్,సీనియర్ నాయకులు బండారి బాల్ రెడ్డి, యువ నాయకులు గూడ విజయ్ రెడ్డి,గుర్రాల రాజిరెడ్డి,నాయకులు రొడ్డ రామచంద్రం,వంగ మల్లారెడ్డి, తిప్పర వేణి ఎల్లం,వట్టెల రాములు, పాతూరి వెంకట్ రెడ్డి,అనింగారి రాజు,తిరుపతి కార్తీక్,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *