ముస్తాబాద్, ఆగస్టు 12 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలంలోని నాలుగో వార్డ్ లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో డ్రైనేజ్ సమస్య ఉండడంతో కాంగ్రెస్ నాయకులు కదంతొక్కి త్వరితగతిన పూర్తి చేశారు. నాలుగో వార్డ్ సభ్యుడు కాంగ్రెస్ నాయకుడు రంజాన్ నరేష్
కావడంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి వెంటనే సమస్యను పరిష్కరించారు. దీంతో పాఠశాల ఆవరణలోని డ్రైనేజ్ ప్రాబ్లం క్లియర్ చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులతో గజ్జల రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహేష్ రెడ్డి, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ గౌడ్, వార్డు మెంబర్లు కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




