ముస్తాబాద్, జనవరి 2 (24/7న్యూస్ ప్రతినిధి) ఆవునూరు గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన గుండం రాములు అనారోగ్యంతో పరమపదించగా వారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ళబాల్ రెడ్డి పరామర్శించి 50కిలో బియ్యాన్ని వారికి అందజేశారు, అలాగే వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీఇచ్చారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, కిసాన్ సేల్ మండల అధ్యక్షులు సారగొండ రాంరెడ్డి, యూత్ మండల అధ్యక్షులు రంజాన్ నరేష్, మండల సోషల్ మీడియా కన్వీనర్ ఏదునూరి భానుచందర్, ఆవునూరు గ్రామ శాఖ అధ్యక్షులు బత్తుల నవీన్, సీనియర్ నాయకులు వుచ్చిడి బాల్ రెడ్డి, అన్నం శ్రీధర్ రెడ్డి, మంత్రి రాజయ్య, ఎండి మనన్, బత్తుల భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
