Breaking News

బొప్పాపూర్ లో విషాదం

326 Views

*బొప్పాపూర్ లో బొమ్మన వేణి రాజు మృతి*

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది.సోమవారం ఉదయం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆటో ప్రమాదానికి గురైన బొప్పాపూర్ వాసి బొమ్మనవేణి రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న బొమ్మన వేణి రాజు పాల సేకరణ నిమిత్తం పలు గ్రామాలు తిరిగి ఆటోలో పాల క్యాన్లను తరలిస్తున్న నేపథ్యంలో, జరిగిన ప్రమాదంలో తలకు బలమైన గాయం తగలడంతో స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు తరలించారు.బ్రెయిన్ సర్జరీ తదుపరి చికిత్స పొందుతూ బుధవారం మధ్య రాత్రి సుమారు రెండు గంటల సమయంలో మృతి చెందారు.వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *