విద్య

టీపీటీఎఫ్ మహా నిరసన

12 Views

టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన

తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం స్థానిక అంబేద్కర్ చౌక్ లో నిరసన ప్రదర్శన నిర్వహించారు.టీపిటీఎఫ్ జిల్లా అధ్యక్షులు దుమాల రమనాథ్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనను నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దుమాల రమనాథ్ రెడ్డి మాట్లాడుతూ
మార్చి 20 న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 26,674 కోట్లు కెటాయించింది.1964లో కొఠారి కమిషన్ రాష్ట్ర బడ్జెట్ లో 30శాతం నిధులు కెటాయించాలని,నిన్నటి తెలంగాణ విద్యాకమిషన్ కూడా 18శాతం నిధులు కెటాయించాలని సిఫార్సులు చేశారు.ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా విద్యకు 15 శాతం నిధులు కెటాయిస్తామని తెలిపారు.దానికి భిన్నంగా నేడు రాష్ట్ర ప్రభుత్వం 8.22 శాతం కెటాయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు వేగంగా పడిపోతున్నది,విద్యాప్రమాణాలు క్షీణిస్తున్నావని అనేక నివేదికలు గగ్గోలు పెడుతున్నవి.పాఠశాలల భౌతిక పరిస్థితులు బాగాలేక తల్లితండ్రులు ప్రైవేటుకు పరుగెడుతున్నారు.ఇట్లాంటి పరిస్థితుల్లో అరకొర నిధులతో నాణ్యమైన పూర్వ ప్రాథమిక, ప్రాథమిక,సెకండరీ విద్యను విద్యార్థులకు అందించలేమనేది వాస్తవం అని అన్నారు.2024 మార్చి నుండి ఉద్యోగవిరమణ పొందిన ఉపాధ్యాయులకు పెన్షనరీ ప్రయోజనాల విడుదలకు సంబంధించిన నిధులు ఈ బడ్జెట్ లో కెటాయించకపోవడం,టీచర్ల వివిధ రకాల ఆర్థిక బిల్లుల విడుదల కోసం ఎదురుచూస్తున్న టీచర్లకు నిరాశనే మిగలడం,విద్యారంగంలో శ్రమదోపిడీకి గురవుతున్న కాంట్రాక్టు టీచర్ల వ్యవస్థ రద్దుకోసం రాష్ట్ర అసెంబ్లీ పరిష్కారం చూపకపోవడంతో,రెండు సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ నూతన పీఆర్సీ ఫిట్మెంట్ ను ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయ సమాజం తీవ్ర మానసిక,ఆర్థిక ఆందోళనలకు లోనవుతున్నారు.అనివార్యమైన పరిస్థితుల్లో  విద్యారంగ అభివృద్ధికి 20 శాతం బడ్జెట్ ను విద్యారంగానికి కెటాయించుటకై,టీచర్ల సమస్యల పరిష్కారానికై స్థానిక అంబేద్కర్ చౌక్ లో నిరసన ప్రదర్శన నిర్వహించి ఈ క్రింది డిమాండ్ల పరిష్కారానికి చొరవచూపగలరని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది అన్నారు.
డిమాండ్లు :

1. విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో కనీసం 20 శాతం బడ్జెట్ కేటాయించాలి.

2 పీఆర్సీ ఫిట్మెంట్ ను వెంటనే ప్రకటించాలి,బడ్జెట్లో నిధులు కెటాయించాలి.

3. రిటైర్డ్ టీచర్ల పెన్షనరీ ప్రయోజనాలను ఏక మొత్తంలో విడుదల చేయాలి.

4. సీపీఎస్ ను రద్దు చేయాలి,2003 డీఎస్సీ టీచర్లకు వెంటనే పాతపెన్షన్ వర్తింపజేయాలి.

5. టీచర్ల పెండింగు బిల్లులు,డీఏ లు విడుదల చేయాలి

6.విద్యారంగంలో కాంట్రాక్టు టీచర్ల వ్యవస్థ విధానాన్ని రద్దు చేయాలి.మినిమం టైంస్కేళ్లు ఇవ్వాలి.రెగ్యులర్ పద్ధతిలో నియామకాలు చేపట్టాలి.

7. కె.జి.బి.వి. మోడల్ స్కూల్,గిరిజన ఆశ్రమ, రెసిడెన్షియల్ స్కూల్ టీచర్లకు కూడా నగదు రహిత వైద్యసదుపాయాన్ని కల్పించాలని నినదించాం అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి కృష్ణ చైతన్య దేవేందర్,శ్రీధర్, వాసుదేవరావు,తిరుపతి రామచంద్రం,బస రాజేందర్ కృష్ణ,వేణు,బండి ఉపేందర్,మధుసూదన్,రజినీ,రాణి, ఎల్లారెడ్డి,రిటైర్డ్ ఉపాధ్యాయులు పురుషోత్తం వెంకన్న, బొజ్జ కృష్ణ,శ్రీనివాస్,వీర్నపల్లి బాధ్యులు శ్రీనివాస్, సుల్తాన్, శ్రీనివాస్,సంతోష్,శ్రీరామదాసు శ్రీనివాస్ కదిరి శ్రీనివాస్,సతీష్,ఎల్లారెడ్డి,బూర భాస్కర్,శ్రీపతి, భూమేష్,సిద్ధంశెట్టి శ్రీనివాస్,రవీందర్,లక్ష్మీనారాయణ చకినాల భాస్కర్,పరమేశ్వర్,దేవయ్య,చంద్రం తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
పందిర్ల రవికాంత్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర క్రైమ్ ఇంచార్జ్ 9848938940

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *