బోయిన్‌పల్లిలో దారుణ విషాదం
హైదరాబాద్:అక్టోబర్ 13
బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. భవాని నగర్ లో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తండ్రి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తన కూతుళ్లకు నిద్ర మాత్రలు ఇచ్చి అనంతరం తండ్రి కూడ నిద్ర మాత్రలు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే ఓల్డ్ బోయిన్ పల్లి భవాని నగర్‌లో నివాసముంటున్న శ్రీకాంత్ చారి కుటుంబం సిల్వర్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గత కొంత కాలంగా ఇంట్లో గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. కానీ ఈ మధ్య ఇలాంటి గొడవలు జరగలేదని ఇప్పుడు బాగానే ఉన్నారని కాని ఈ ఘటన ఎలా జరిగిందో అంతు చిక్కడం లేదని స్థానికులు చెబుతున్నారు.
శుక్రవారం తెల్లవారు జామున తండ్రి నిద్ర మాత్రలు వేసుకుని కూతుళ్లు శ్రావ్య (7),స్రవంతి(8)లకు నిద్ర మాత్రలు ఇవ్వడంతో చిన్నారులతో పాటు తండ్రి చనిపోయారు.
ఒకేసారి కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు చనిపోవడంతో భవాని నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న బోయిన్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్య జరిగిన తీరును పరిశీలిస్తున్నారు.
తమ కొడుకు మనవరాలు చనిపోవడానికి గల కారణాలు తమకే తెలియడం లేదన్నారు. ప్రతిరోజు ఆయన సిల్వర్ వృత్తికి వెళ్తున్నారని అన్నారు. గత కొంతకాలంగా ఆయన వృత్తి సరిగా నడవడం లేదని అన్నారు. పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.
