Breaking News రాజకీయం

జీవన్ రెడ్డి తో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలక భేటీ

48 Views

జీవన్ రెడ్డి తో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలక భేటీ.

ససేమిరా అంటున్న జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా:మార్చి 24
కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో నేడు ఆయన నివాసానికి పిసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,ఏఐసీసీ చీఫ్ సచిన్,విప్ అది శ్రీనివాస్, చేరుకున్నారు.ఈ క్రమంలో రాజీ కుదిరిచ్చే ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ రాజకీయ నిర్ణయాలతో జీవన్ రెడ్డి,చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారన్నారు. జీవన్ రెడ్డి కి ఆయన అనుచరులకు అన్యాయం జరిగిందన్న ఆవేదన ఆయన మాటల్లో వ్యక్తం అయిందనీ తెలిపారు.కాగా మొన్న మంత్రి శ్రీదర్ బాబు,అడ్లూరి లక్ష్మణ్ పార్టీలో కొనసాగాలని కోరడంతో మీకో దండం అంటూ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మహేష్ కుమార్ గౌడ్ తో భేటీ తర్వాత కూడా జీవన్ రెడ్డి ససేమిరా అనడంతో పాటు నిర్ణయంలో మార్పులేదని,పూర్తి వివరాలు 25న వెల్లడిస్తానని జీవన్ రెడ్డి తెలిపినట్లు సమాచారం.అయితే తన నివాసం నుంచి మహేష్ కుమార్ గౌడ్, వెళ్లిపోయిన వెంటనే జీవన్ రెడ్డి, బయటకు వచ్చారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీలో ఇదే నా చివరి రోజు అని సంచలన ప్రకటన చేశారు.రేపు సమావేశం యధావిధి గా ఉంటుందని తెలిపారు ఇదే సమయంలో జీవన్ రెడ్డి ఇంటి పైన ఇందిరా భవన్ అనే పేరుతో ఉన్న ఫ్లెక్సీలను కార్యకర్త తొలగించడం తో జీవన్ రెడ్డి పార్టీ మార్పు ఖాయమే అని తెలుస్తోంది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *