ప్రాంతీయం

ముగిసిన ఎన్,ఎస్,ఎస్, వేసవి శిక్షణ తరగతులు . సామాజిక సేవలో విద్యార్థులు ముందు ఉండాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ డా. ఎస్. నరేందర్ రెడ్డి

26 Views

ముగిసిన ఎన్,ఎస్,ఎస్, వేసవి శిక్షణ తరగతులు . సామాజిక సేవలో విద్యార్థులు ముందు ఉండాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ డా. ఎస్. నరేందర్ రెడ్డి.

మంచిర్యాల జిల్లా  మార్చి 23: ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాల ఎన్.ఎస్.ఎస్, విభాగం ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న వేసవి కాలం ప్రత్యేక శిక్షణ తరగతులు సోమవారం ముగిసాయి, ఎన్,ఎస్,ఎస్, శిక్షణ తరగతులలో భాగంగా చివరి రోజున ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులు పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించి, అనంతరం పాత మంచిర్యాలలోని సాయిబాబా ఆలయానికి వెళ్లి ఆలయ పరిసరాలను శుభ్రపరిచి, స్థానిక నివాస గృహాలకు వెళ్లి సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించారు, శిక్షణా తరగతులకు ముఖ్యఅతిథిగా మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల, సంక్షేమ శాఖ, మంచిర్యాల నుండి విచ్చేసిన విజయ, విద్యార్థులకు బృణ హత్యలు, బాల్య వివాహాలు, సమాజంలో జరుగుతున్న అనేక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డా. ఎస్. నరేందర్ రెడ్డి, మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సామాజిక బాధ్యతగా, సమాజంలో తమ వంతు పాత్ర పోషించాలని, సమాజానికి సేవ చేయడం గొప్ప విషయమని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని, ఏదైనా తమ దృష్టికి వస్తే దానిని పెద్దల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కారం దిశగా కృషి చేయాలని, విద్యార్థులు మంచి లక్షణాలను అలవర్చుకొని సమాజానికి మేలు చేసి, జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా. ఏం. కుమారస్వామి, డా. కె. రాజయ్య, ఎన్ సి సి ఆఫీసర్ జాడి మహేష్ కుమార్, పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *