ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 23, నిన్నటి రోజున ప్రచురితమైన ముస్తాబాద్ మండల సఫాయి కార్మికులు మాట్లాడిన మాటలను కల్వకుంట్ల శ్రీనివాస్ రావు స్పందించి మా మోహినికుంట గ్రామంలో ఎన్నో ఏళ్లుగా సపాయిలను అన్నిరకాల వసతులు కల్పించడం ముందు వరసలో ఉన్నామన్నారు. వివరాల్లోకెళ్తే దసరాకు కొత్త దుస్తులు వారు ఊరికి చేస్తున్నటువంటి సేవలను గుర్తించి వారికి ఫ్లెక్సీలు కూడా కట్టడం ప్రతిదసరా పండుగకు ఒక్కొక్కరికి మిగతా వాటితో కలుపుకొని కేజీ మటన్ అందిస్తున్నాము. టీ ,బిస్కెట్లు, స్నాక్స్ ప్రతిరోజు అందిస్తూ దీపావళి కి స్వీట్స్ డబ్బాలు కూడా ఇవ్వడం అన్ని రకాలుగా దరికి చేరుస్తూ బార్డర్ మీద ఉండే సిపాయిలు ఏ విధంగానైతే ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తుందో ఆ విధంగా వారిని గౌరవించి అన్ని రకాలుగా వారిని చూసుకుంటున్నామన్నారు. అదేవిధంగా వారికి హాస్పిటల్ సదుపాయం కూడా కల్పిస్తున్నాం కంటి పరీక్షలు చేయించి అవసరమైన వాళ్లకు ఆపరేషన్లు కూడా చేస్తున్నాంమని మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు.
