ప్రాంతీయం

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు…

125 Views

ముస్తాబాద్ డిసెంబర్ 9, ముస్తాబాద్ మండల కేంద్రంలో  కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు..ఈసందర్భంగా పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు మాట్లాడుతూ 1200 మంది తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తించి తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన మహనీయురాలు సోనియా గాంధీకి ఎన్నోసార్లు పదవి అవకాశం వచ్చిన తృణప్రాయంగా వదిలేసిన ఘనత సోనియాగాంధీది అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అరికట్టి రాబందుల రాజ్యాన్ని పారదోలే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని మళ్లీ వచ్చే జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేసుకొని వేడుకలు నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు,జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది గారి శ్రీనివాస్, సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, కరెడ్ల కొండల్ రెడ్డి, ఉచ్చిడి బాల్ రెడ్డి, అరుట్ల మహేష్ రెడ్డి, ఉపేందర్, యాగండ్ల మల్లేశం, మామిండ్ల ఆంజనేయులు, బుగ్గ రమేష్,మాడూరి కిషన్, దీటి కనకయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు రంజాన్ నరేష్,తాళ్ల విజయ్ రెడ్డి, మిరుదొడ్డి భాను తదితరులు పాల్గొన్నారు..

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7