ప్రాంతీయం

ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తాం

238 Views

– కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి

దౌల్తాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని దౌల్తాబాద్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శేరిపల్లి బందారం గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సంతోషదాయకమని పేర్కొన్నారు. దుబ్బాక ఫలితాలతో కార్యకర్తలు ఎవరూ నిరాశ చెందవద్దని పేర్కొన్నారు. తాను నిరంతరం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని, కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు పడాల రాములు, నాయకులు ఆది వేణుగోపాల్, గొల్లపల్లి కనకయ్య, భద్రయ్య, లాలూ, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *