ప్రజా పక్షం/ ఎల్లారెడ్డిపేట ప్రతినిధి
ఎల్లారెడ్డిపేట మండలంలో
ప్రజాపంపిణీ బియ్యము అక్రమంగా తరలిస్తున్న సమాచారంతో శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఎస్సై శేఖర్ ర్ తన సిబ్బందితో ఎల్లారెడ్డిపేట గ్రామ శివారులో కి వెళ్లగా నారాయణపూర్ గ్రామం నుండి వస్తున్న, ఓమ్ని ఏపీ.28. బిజీ.7642. గల వాహనం ఆపి తనిఖీలు నిర్వహిస్తుండగా 6 క్వింటాళ్ల బియ్యం ఉన్నాయన్నారు, పిడిఎఫ్ రవాణాకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేవని వారి వాహనాల ను స్వాధీనపరచుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు నారాయణపూర్ కు చెందిన అక్రమ రవాణా చేస్తున్న, అనరాసి కనకయ్య అనే అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ తెలిపారు
