వైరా నవంబర్ 26 :ఎంపీ నామ లో మానవత్వం పరిమళిoచిన వేళ.
కళ్లెదుటే రోడ్డు ప్రమాదం…చలించి, తక్షణమే తన స్వంత వాహనంలో క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలింపు
నామ చొరవతో తప్పిన ప్రాణాపాయం….
నామకి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు
ఎంపీ నామ నాగేశ్వరరావు లో మానవత్వం మరోసారి పరిమళిoచింది. తన కళ్లెదుటే జరిగిన రోడ్డు ప్రమాదానికి చలించిపోయారు. ఉన్న ఫలంగా వెంటనే తను ఉన్న వాహనాన్ని దిగి, అందులో క్షతగాత్రుడిని ఎక్కించి, ఆస్పత్రికి తరలించి, మానవత్వం చూపించిన మెటైన సత్తా ఉన్న రాజకీయ నాయకుడుగా మరోసారి నిరూపించుకున్నారు నామ నాగేశ్వరరావు ..
అసలేం జరిగిందంటే ..
ఎన్నికల ప్రచారాన్ని పురష్కరించుకుని ఎంపీ నామ ఆదివారం ఉదయం ఖమ్మం నుండి మధిర వెళ్తున్న క్రమంలో వైరా పాత సెంటర్ లో ఒక వ్యక్తి టూవీలర్ నడుపుకుంటూ వెళ్తూ ఆకస్మికంగా రోడ్డుపై వాహనంతో సహా కిందపడి, గాయపడ్డారు… అటుగా వెళ్తున్న ఎంపీ తక్షణమే స్పందించి తన స్వంత వాహనం లో క్షతగాత్రుడిని ఎక్కించి, తన సిబ్బందిని పంపించి స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఏమాత్రం ఆలస్యమైనా ఇబ్బంది ఏర్పడేది. క్షతగాత్రుడు పొన్నం అప్పారావుది కొణిజర్ల మండలం వాస్తవ్యుడని తెలిసింది..స్థానికులు , బాధిత కుటుంబ సభ్యులు నామ స్పందించిన తీరుకు, మానవత్వానికి అభినందనలు తెలిపి, కృతజ్ఞతలు కూడా తెలపడం గమనార్హం..