ప్రాంతీయం

కోహెడ, నంగునూరు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి

447 Views

కోహెడ, నంగునూరు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 8, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని ఘనపూర్ గ్రామం లో శనివారం రాత్రి పులి వచ్చి ఒక లేగ దూడను చంపడం జరిగింది.కోహెడ మండలంలోని ఆరెపల్లి వైపు పులి సంచారం అని ప్రచారం జరుగుతున్నాoదునా,సముద్రాల వివిధ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులను ఇంటివద్దనే కట్టేయాలానీ, చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, ప్రజలు జాగత్తగా ఉండాలని,పంట పొలాల దగ్గరికి ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని కోహెడ ఎస్సై అభిలాష్ తెలిపారు. ఎవరికైనా పులి ఆనవాలు గానీ పులి కనబడితే కోహెడ పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.పెద్ద పులి తిరుగుతోంది జాగ్రత్తపొలాల వద్ద పశువులను కట్టేయకండి.ఈరోజు ప్రజలు ఎవరూ కూడా ఒంటరిగా తిరగవద్దు. పశువుల కాపరులు బస్వాపూర్, కూరెళ్ల గూండారెడ్డిపల్లి తంగళ్ళపల్లి, శనిగరం గ్రామాల వారు అప్రమత్తంగా ఉండగలరు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *