జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ సంచలనాలను నమోదు చేయడం ఖాయం..
మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి…
తొగుట; అభివృద్ధి సంక్షేమ, శాంతి సామరస్య భారతే మన లక్ష్యంగా సీఎం కేసీఆర్ గారు జాతీయ పార్టీని స్థాపించి, జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్న సందర్భంగా మన తెలంగాణ బిడ్డకు అఖండ మద్దతు అందిద్దామని మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు… దసరా రోజున మధ్యాహ్నం సీఎం కేసీఆర్ గారు జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికల కమీషన్ ఆమోదం తెలపడంతో నేడు అధికారికంగా టిఆర్ఎస్ పార్టీ brs పార్టీగా రూపాంతరం చెందిందన్నారు.. ..70 ఏళ్లలో జరగని అభివృద్ధి సంక్షేమం8 ఏళ్లలో చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కుతుందన్నారు..తెలంగాణ మోడల్ గా దేశాన్ని అభివృద్ధి చేయడానికే.. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నారని ఆయన తెలిపారు..
బక్క పలుచని నాయకుని మనోధైర్యం తో…పిడికెడు మందితో ప్రారంభమై.. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష గా మరి..తెలంగాణ స్వప్నం ను నెరవేర్చిన పార్టీగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది.
స్వరాష్ట్రం కోసం తన ప్రాణాన్ని ఫణంగా పెట్టిన కేసీఆర్,గారు.. తెలంగాణ సాధించిన వ్యక్తిగా..ప్రజల ఆశీస్సులతో సీఎంగా బాధ్యతలు చేపట్టి అనతి కాలంలోనే తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపారు. ….రెండవ సారి సైతం.. అభివృద్ధి సంక్షేమం గీటు రాయిగా..ప్రజల మద్దతుతో..అధికారంలోకి రావడం జరిగింది. సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి,సంక్షేమం చూసి… కేంద్రం,కేంద్ర మంత్రులు,నీతి ఆయోగ్, దేశ, విదేశ ప్రముఖులు దేశానికి రోల్ మోడల్,ఆదర్శమని తెలంగాణను ఎన్నోసార్లు అభినందించారు….
ఇది ఒక దేశం..మనం ఒక్కరము బాగుపడితే సరిపోదు..దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి..అంటే ఈ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాయం కావాలి..ప్రజల ఆకాంక్షను నేరవేర్చే పార్టీలు అధికారంలోకి రావాలి..అందుకే వొస్తున్నాము…దేశ ప్రజల బంగారు భవిత కోసమే..ఏదైతే 8 ఏళ్ల తెలంగాణ లో అభివృద్ధి, సంక్షేమం లో ఎలాంటి విప్లమాత్మక కార్యక్రమాలు చేపట్టామో..అవి దేశ వ్యాప్తంగా అమలు కావాలి..అందుకే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి గా ఏర్పాటు చేసి..జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నామని..సీఎం కేసీఆర్ గారు ప్రకటించారు..నేటితో అధికారికంగా.. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తో జాతీయ రాజకీయాల్లో కి వెళ్లే ప్రస్థానం షూరువైందన్నారు.
స్వరాష్ట్రంలో అద్భుతమైన విజయాలు సాధించినట్లుగానే దేశాన్ని కూడా అదే మార్గంలో తీసుకెళ్లాలి…జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషించాలనే సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ గత అక్టోబర్లో విజయ దశమి పర్వదినాన ప్రకటించారు.
నిన్న అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ పేరు మార్పును దృవీకరించడం సంతోషకరమన్నారు..సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి స్పూర్తితో రాబోయే రోజుల్లో దేశంలో మార్పు రావడం ఖాయమన్నారు..
పిడికెడు మందితో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ మీద ఎన్నో విమర్శలు చేశారని, కానీ ఎన్ని అడ్డంకులు ఎదురైనా సీఎం కేసీఆర్ గారు తెలంగాణ సాధించి, 8 ఏళ్లలో తెలంగాణ ను అభివృద్ధి, సంక్షేమం లో దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడం జరిగిందన్నారు…జాతీయ స్థాయిలో రాజకీయాలను సీఎం కేసీఆర్ శాసించడం ఖాయమన్నారు..సీఎం కేసీఆర్ గారి రాక కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు.. దసరా పండుగ అంటేనే..విజయానికి చిహ్నంగా భావిస్తామని, ఆరోజున సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ..దేశ రాజకీయాల్లో సంచలనం నమోదు చేయడం ఖాయమన్నారు.. ..
