ప్రాంతీయం

యోగాతో ఒత్తిడికి ఉపశమనం.. ఆరోగ్యానికి భరోసా : రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

11 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

*యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి.* *యోగాతో ఒత్తిడికి ఉపశమనం.. ఆరోగ్యానికి భరోసా : రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా*

నేటి జీవన విధానంలో మనిషి అనేక ఒత్తిళ్లకు గురవుతున్నాడని, యోగా ద్వారా వాటి నుంచి ఉపశమనం పొందవచ్చని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్, అధికారులు, సిబ్బందికి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.యోగా అనేది ఒకరోజు నిర్వహించే కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాల్సిన ఆరోగ్య సాధనమని పేర్కొన్నారు.యోగా చేయడానికి ప్రత్యేకమైన పరికరాలు గానీ, ఇతరుల సహకారం గానీ అవసరం లేదని, వ్యక్తిగత నిబద్ధత, సంకల్పం ఉంటే సరిపోతుందని అన్నారు.ఆరోగ్యమే మహాభాగ్యమని, మంచి ఆరోగ్యం మనిషికి అత్యంత విలువైన ఆస్తి అని పేర్కొన్నారు. జీవితంలో ఎంతటి ఉన్నత స్థానాలు సాధించినా,ఎంతటి సంపద సంపాదించినా వాటిని ఆనందించడానికి ఆరోగ్యవంతమైన శరీరం అవసరమని తెలిపారు.అందుకే ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగా సాధన చేయడంతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులను కూడా యోగా చేయడానికి ప్రోత్సహించాలని సూచించారు.పోలీస్ సిబ్బంది సాధారణంగా శారీరక దృఢత్వానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని, కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న యువ పోలీస్ సిబ్బందిని అభినందించారు. యువత తమ శారీరక,మానసిక ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపాలని, ప్రస్తుతం అందరూ మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నారని, భవిష్యత్తులో కూడా అదే స్థాయిని కొనసాగించాలని సూచించారు.యోగా ఒకరోజుతో పరిమితం కాకుండా నిత్య జీవితంలో భాగం కావాలని,యోగా దినోత్సవానికే పరిమితం చేయకుండా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి శాఖల స్థాయిలో ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి సిబ్బందిలో అవగాహన పెంపొందించాలని అధికారులను ఆదేశించారు.యోగాతో ప్రశాంతమైన మనస్సు, ఆరోగ్యవంతమైన శరీరం లభిస్తాయని, మానసిక ప్రశాంతతకు,శారీరక దృఢత్వానికి యోగా ఉత్తమ సాధనమని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.నిత్య యోగా సాధన ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండవచ్చని తెలిపారు.ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు చెందిన యోగా శిక్షకుల ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్‌తో పాటు అధికారులు, సిబ్బంది యోగా ఆసనాలను అభ్యసించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్,గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ అఫ్జలోద్దీన్, రామగుండం సీఐ కృష్ణకుమార్,ఆర్‌ఐలు దామోదర్,మల్లేశం, శేఖర్,రమేష్, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు,ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ యోగా శిక్షకురాలు రాధిక తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *