ప్రాంతీయం

చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

115 Views

దౌల్తాబాద్: ఈనెల డిసెంబర్ 19 న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద టీ ఎమ్మార్పీఎస్ తలపెట్టిన ఛలో ఢిల్లీ మాదిగల లొల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కొలుపుల స్వామి పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కరపత్రాన్ని విడుదల చేశారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం బిజెపి ప్రభుత్వం 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చి తొమ్మిది ఏండ్లు గడిచినప్పటికి వర్గీకరణ బిల్లు గురించి ఊసెత్తడం లేదన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ 2014లో మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఆ తీర్మానాన్ని చెత్తబుట్టలో వేసిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాలిగారి కృష్ణ, మండల అధ్యక్షులు రత్నం, నాయకులు ఇమాన్యెల్,రాజు, రాజు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7