ప్రాంతీయం

బాధిత కుటుంబాలకు పరామర్శ

100 Views

దౌల్తాబాద్: మండల పరిధిలోని కోనాపూర్ ఉపసర్పంచ్ రాజిరెడ్డి తల్లి సుశీల అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకున్న దుబ్బాక మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత గురువారం పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో గోవిందా పూర్ గ్రామంలో సంజయ్ గౌడ్, ఉప్పరపల్లి టిఆర్ఎస్ కార్యకర్త గొల్ల సిద్ధిరాములు, ముబారస్ పూర్ లో దుర్గయ్య కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు నర్ర రాజేందర్, సర్పంచులు యాదగిరి, చిత్తారి గౌడ్, ఎంపీటీసీలు తిరుపతి, శేఖర్ రెడ్డి మండల కో ఆప్షన్ సభ్యులు హైమద్, నాయకులు కలీలోద్దీన్, రాజలింగం గౌడ్, భాను ప్రసాద్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Jana Santhosh