దౌల్తాబాద్: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ 108 వాహనంలో ప్రసవించింది. మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన కవిత పురిటి నొప్పులతో బాధపడుతుండగా 108 కి సమాచారం అందించారు. దౌల్తాబాద్ 108 వాహనంలో గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యమంలో నొప్పులు రావడంతో సిబ్బంది ప్రసవం చెయ్యగా ఆడబిడ్డ జన్మించిందని 108 సిబ్బంది విజయ్ కుమార్ నర్సింలు తెలిపారు. తల్లి బిడ్డకు అంబులెన్స్ లోనే ప్రథమ చికిత్స చేసి గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో చేర్పించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వారు తెలిపారు.




