ప్రాంతీయం

కులవృత్తులకు అధిక ప్రాధాన్యత

80 Views

దౌల్తాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కులవృత్తులకు అధిక ప్రాధాన్యత లభించిందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కోనాయిపల్లి గ్రామంలో యాదవ సంఘం భవన నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు కాగా పత్రాన్ని యాదవ సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కులవృత్తులను ప్రోత్సహించేలా సంక్షేమ పథకాల ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. భవన నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేసిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి యాదవ సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శేఖర్ రెడ్డి, యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు….

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *