Breaking News

అ వివక్ష కేవలం దళితుల పైనే ఎందుకు అని మాల మహా నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం డిమాండ్ చేశాడు

103 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో విలేకరుల సమావేశం లో గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా మాలమహా నాడు అధ్యక్షుడు దోసల చంద్రం మాట్లాడుతూ ఇస్లాం, క్రైస్తవం లోకి మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వలేమని క్షేత్రస్థాయిలో ఆ మతాల్లో అస్పృశ్యత, అంటరానితనం అంతగా లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పడం శోచనీయమని తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం అన్నారు. ఇస్లాం క్రైస్తవ్యంలోకి మారిన దళితులు కులవృత్తులను చేపడుతూ, మిశ్రమ సంస్కృతిని కొనసాగిస్తున్నారని, ఇక్కడ దేవుడు మాత్రమే మారుతున్నాడని ఇతర సంస్కృతి సాంప్రదాయాలు కులవృత్తులు మారడం లేదని మరియు మతాన్ని, భారతీయ సంస్కృతిని వేరు చేసి చూడకపోవడం కేంద్ర ప్రభుత్వ మత వివక్షకు నిదర్శనమని, నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇస్లాం, క్రైస్తవ్యంలోకి మారిన దళితులు హిందూ మతాల వారిలాగే వివక్షను ఎదుర్కొంటున్నారని ఇతర అగ్రకులాల చేత దాడులకు గురవుతున్నా రని సమాజంలో పలు రకాలుగా ఉన్న అంటరానితనముతో వివక్షకు గురవుతున్నా రని మరియు ఆర్థిక వెనుకబాటుతనంతో అనేక కష్టాలు వెల్లదీస్తున్నారని, క్షేత్రస్థాయి లో క్షుణ్ణంగా పరిశీలించి ఇచ్చిన జస్టిస్ రంగనాథ్ మిశ్రా నివేదికను కాదని, కోర్టుకు కేవలం మత ప్రాతిపదికన ఆలోచిస్తూ ఇస్లాం, క్రైస్తవ్యంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వలేమని కేంద్రం తెలపడం శోచనీయమని, ఇలాంటి అభిప్రాయాన్ని వెనక్కి తీసుకొని వాస్తవాలను కోర్టుకు తెలుపాలని, అదేవిధంగా ఇతర కులాల వారికి లేనటువంటి మత వివక్ష కేవలము దళితులకే ఎందుకని, ఎస్టీలు, బీసీలు ఓసీలు మతం మారితే రిజర్వేషన్ మారడం లేదు. అలాంటిది కేవలం ఎస్సీలు మతం మారితేనే రిజర్వేషన్లలో మార్పులు చేయడం పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘణ క్రిందకు వస్తుందని. కేవలం కేంద్ర ప్రభుత్వము మతపరమైన ఆలోచనలతో మాత్రమే ఇలాంటి వివక్షలను కొనసాగించడానికి ప్రయత్నం చేస్తుందని, అస్పృశ్యత అంతగా లేదని అంటున్నారని మరి ఎంతగా ఉంటే రిజర్వేషన్ ఇస్తారో దానికి నిర్వచనం కేంద్ర ప్రభుత్వమే తెలపాలని ఇప్పటికైనా మత వివక్షతతో కూడిన అభిప్రాయాలను కోర్టుకు వెల్లడించకుండా వాస్తవాలను వెల్లడించి, భారత రాజ్యాంగ సమానత్వ స్పూర్తికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని, భారతదేశంలో మతపరమైన మార్పుల కంటే కులపరమైన బీజాలకే ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తున్నారని కాబట్టి కులపరమైన రిజర్వేషన్లకు మాత్రమే ప్రాముఖ్యతనివ్వాలని అది కేవలం దళితులపైన వివక్ష చూపడం సరైనది కాదని, భారత అత్యున్నత న్యాయస్థానం పలు సందర్భాల్లో మతం మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వడాన్ని చాలా సందర్భాల్లో సమర్థించడం జరిగిందని ఇప్పటికైనా కోర్టును తప్పుదోవ పట్టించే నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని, భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉన్న తీర్పు న్యాయస్థానం ద్వారా వస్తుందని ఆశిస్తున్నామని ఈ సందర్భంగా తెలంగాణ మాల మహానాడు రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు దోసల చంద్రం డిమాండ్ చేశారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7